సాధారణంగా తెలుగు సినిమా షూటింగ్ సమయంలో వాడిన కాస్ట్యూమ్ లను వదిలేసి వెళ్లిపోవడం జరుగుతుంది. అయితే కొందరు హీరోయిన్స్ తమ ఇళ్లకు కూడా తీసుకెళ్లి పోతుంటారు. కొందరికైతే మూవీ నిర్మాతలు గిఫ్ట్ గా ఇచ్చేస్తారు. రవితేజ హీరోగా నటించిన వంశీ దర్శకత్వంలోభారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో హీరోయిన్ గా అప్పటి స్టార్ హీరోయిన్ కళ్యాణి గారు చేసారు . ఈ సినిమాలో తాను కట్టుకున్న చీరలన్నీ కాటన్ చీరలే. ఆ చీరలు ఆమెకు ఎంతగానో నచ్చేసాయట చీరలు చాలా బాగున్నాయని ఆమె తెగ ముచ్చట పడడంతో వాటిని ఆమెకు బహుమతిగా ఇచ్చేసారట. వాటిని పట్టుచీరలగా భావించి పట్టుకెళ్లినంత సంతోషంగా ఆమె తీసుకెళ్లడం జరిగిందని సమాచారం.

అసలు ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా తీయడమే ఒక మిరాకిల్ దాగుందట. అప్పటికీ వరుస ప్లాప్ లతో నిరాశతో ఉన్న దర్శకుడు వంశీ ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఉండలేక కేంద్ర పాలిత ప్రాంతం అయిన యానాం వెళ్లిపోవడానికి అయన ప్రయాణమాయ్యారట.అదే సమయంలో వేమూరి సత్యనారాయణ గారు వంశీకి ఫోన్ చేసి, హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా బాగా ఉందని తమ ఊరికి చెందిన వేమూరి రమేష్ అనే వ్యక్తి ఒక సినిమా మీతో చేయాలని అనుకుంటున్నట్లు చెప్పడంతో వంశీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. కథ సిద్ధం చేయబోతున్న సమయంలో వేమూరి రమేష్  గారు మళ్ళీ అమెరికా వెళ్లిపోవడంతో వంశీ పరిస్థితి అటు ఇటు కాకుండా పోయింది.

ఈ సమయంలో గంగోపాధ్యాయ చెప్పిన కథను ఆధారం చేసుకుని అప్పటి యంగ్ హీరో అయిన శివాజితో మూవీ చేయాలని వంశీ అనుకున్నాడట మరోవైపు అప్పట్లో భారీ విజయం సాధించిన మహర్షి మూవీకి మేనేజర్ గా పని చేసిన వల్లూరిపల్లి రమేష్ నిర్మాత అవతారం ఎత్తాలని అనుకుండడంతో రవితేజను హీరోగా ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ గా అప్పటి స్టార్ హీరోయిన్ లయను తీసుకోవాలి అనుకున్నా డేట్స్ కుదరక అప్పట్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణిని ఎంపిక చేసారట. కాకినాడకు చెందిన పాపారావు చౌదరి గారిని రచయిత గా మరియు నటుడిగా ప్రవేశం ఇప్పిస్తూ ఆయన పేరును కృష్ణ భగవాన్ గా పేరు మార్చడం జరిగింది.విశాఖ పోర్టులో పనిచేసి పదవి విరమణ చేసిన కొండవలస లక్ష్మణరావు గారిని ఐతే ఒకే ఊతపదం ఉన్న డైలాగ్ ను బాగా ప్రాక్టీస్ చేయించి, సినిమాలోకి తీసుకున్నట్లు సమాచారం.మొత్తానికి వంశీ  ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీతోభారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఇండస్ట్రీలో మళ్ళీ తన మార్క్ సినిమాలు తీయడం కొనసాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: