తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఎంతో టాలెంట్ తో పాటు కొంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ విధంగా చాలామంది తమ టాలెంట్ కు అదృష్టాన్ని జత చేసుకుని ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.  యాక్షన్ హీరో బిజీ అనే సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

తెలుగులో మజ్ను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ వెంటనే తమిళంలో కూడా హీరోయిన్ గా ఎంట్రీ చేసి రెండు భాషల్లో ఒకేసారి సినిమా ఆరంగెట్రం చేసింది. ఇక కొన్ని తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అది బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తెలుగులో ఈమె పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి పై భారీ ఆశలు పెట్టుకోగా ఆ చిత్రం ప్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య సినిమా చేసినా అది కూడా వర్కవుట్ కాకపోవడంతో ఈమెకు ఎవరు అవకాశం ఇవ్వలేకపోయారు. 

ప్రస్తుతం సైడ్ పాత్రలు, సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కువగా చేస్తుంది ఈమె. గీతగోవిందం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ లో నటించిన అను ఆ తరువాత అల్లుడు అదుర్స్ లో సెకండ్ హీరోయిన్ పాత్ర చేసింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న మహాసముద్రం సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా అయినా ఆమెకు మంచి కం బ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి. అల్లు శిరీష్ తో కలిసి ప్రేమ కథ చిత్రం లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ హిందీ భాషల్లో కూడా ఆమె కెరీర్ అంతా బాగోలేదు అని చెప్పాలి. మలయాళంలో కూడా ఈమెను పెద్దగా ఆదరించడం లేదు. ఈ నేపథ్యంలో అను మళ్లీ అవకాశాల కోసం వేట కొనసాగిస్తుందా లేదా ఫేడ్ ఔట్ అయిపోతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: