డబ్బుని ఇష్టపడనివారంటూ ఉండరు. డబ్బుకోసం కొంత మంది నటులు వారి సినీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆలా సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్స్ లో ఆసిన్ ఒక్కరు. ఆమె గత కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఆసిన్ మాత్రం పది కోట్ల రూపాయలకు ఆశపడి తన సినీ జీవితాన్ని నాశనం చేసుకుందని ఇండస్ట్రీలో కొంతమంది చెప్పారు.

ఆసిన్ సూర్య జంటగా నటించిన గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో మంచి అవకాశాలను అందుకుంది. ఆమె అమ్మ నాన్నతమిళ అమ్మాయి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ, శివమణి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు, పేరు సంపాదించుకుంది. అంతేకాదు.. పలు డబ్బింగ్ సినిమాలలో నటించిన ఈమె.. చాలావరకు స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. ఇక ఆసిన్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలో కూడా నటించింది.

కొలీవూడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆసిన్ 2007లో క్వీన్ ఆఫ్ కోలీవుడ్ అనే బిరుదు అందుకుంది. ఇక 2016లో మైక్రోమ్యాక్స్ సంస్థకు కో ఓనర్ గా చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. కాగా.. ఆమె స్టార్ హీరోయిన్ గా తన హోదాను కొనసాగిస్తున్న సమయంలో సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఈ భామ.

అయితే అందుకు ప్రదానం కారణం ఏమిటంటే.. ఒక సంవత్సరం పాటు ముంబైకి చెందిన సెలబ్రెటీ మేనేజ్మెంట్ కంపెనీలో చేరగా ఆ కంపెనీతో ఓ ఒప్పందం పెట్టుకుంది. అయితే ఒక సంవత్సరం వీరి కంపెనీకే పనిచేయాలని ఒప్పందం ఉండడంతో అదే సమయంలో ఈమెకు మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక 10 కోట్ల రూపాయలు ఇస్తామని కంపెనీ వారు చెప్పడంతో ఆమె ఆశపడి వెళ్లడం శాశ్వతంగా అవకాశాలను కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: