ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రం దాపరికాలు లేకుండా నిర్మొహమాటంగా చెప్పే అలవాటు కొంత మందికి ఉంటుంది. వారు చెప్పే విషయం ఎంత పర్సనల్ అయినా కానీ దానిని ఏమాత్రం సంకోచం లేకుండా తెలియజేస్తూ  ఉంటారు కొంతమంది. అలాంటి వ్యక్తులలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఒకరు. అయితే తాజాగా సోనాక్షి సిన్హా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది, ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రిలేషన్ షిప్స్ మరియు లవ్ గురించి ఓపెన్ అయ్యింది. తన స్కూల్ లవ్ స్టోరీ నుంచి తన యంగ్ ఏజ్ లవ్ స్టోరీ వరకు సోనాక్షి సిన్హా చెప్పేసింది. మీరు ఎప్పుడు అయిన ఎవరితో అయిన రిలేషన్ షిప్ లో ఉన్నారా అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సోనాక్షి సిన్హా సమాధానమిస్తూ, స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తో రిలేషన్ షిప్ లో ఉన్నానని, కానీ అది కొద్ది కాలానికే ముగిసింది అని సోనాక్షి సిన్హా తెలియజేసింది.

ఆ తర్వాత 21,22 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలియజేసింది. ఒక వ్యక్తి తో ఐదు సంవత్సరాల పాటు సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నాను అని తెలియజేసింది. వయసు పెరిగే కొద్దీ కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతాయి సోనాక్షి సిన్హా తెలియజేసింది. ప్రతి రిలేషన్ షిప్ నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అని, మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలి అని సోనాక్షి సిన్హా తెలియజేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా కూతురే సోనాక్షి సిన్హా. సోనాక్షి సిన్హా, సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ సాధించడంతో  వరస ఆఫర్లను కొట్టేసింది. రీసెంట్ గా సోనాక్షి సిన్హా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' మూవీ లో అజయ్ దేవగన్ తో కలిసి నటించి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: