సినిమా ఇండస్ట్రీలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి కారణంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో యంగ్ ఏజ్ లో సెలెబ్రిటీలు ప్రాణాలు కోల్పోవడం కొత్తేమి కాదు. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఎంతోమంది స్టార్ హీరోయిన్లు చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టారు. టాలీవుడ్ యువ తారలు ఆర్తీ అగర్వాల్, సౌందర్య, ప్రత్యూష, సిల్క్ స్మిత మరణించినప్పటికీ ఐకాన్‌లుగా మారారు.

సౌందర్య
సౌందర్య 90వ దశకంలో స్టార్ నటీమణులలో ఒకరు. 12 సంవత్సరాలకు పైగా ఆమె ఒక్క తెలుగులోనే 114 చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె బలమైన క్యారెక్టర్ రోల్స్‌ను ప్రయత్నించి గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రశంసలు అందుకుంది. ఆమె ఒక విషాద విమాన ప్రమాదంలో మరణించడానికి ముందు రాజకీయ ఎంట్రీ ఇవ్వాలనుకుంది. ఏప్రిల్ 17, 2004న, సౌందర్య బెంగుళూరు నుండి కరీం నగర్ వెళ్లే విమానంలో ప్రయాణిస్తుండగా అది కూలి టాలీవుడ్ ఒక గొప్ప నటిని కోల్పోయింది.

భార్గవి
చాలా త్వరగా జీవితం ముగిసిపోయిన మరో ప్రతిభావంతురాలు భార్గవి. ఆమె నాని నటించిన 'అష్టా చమ్మా'తో గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విడుదలైన కొద్ది నెలలకే నటి బంజారాహిల్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆర్కెస్ట్రా ఆపరేటర్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి శవమై కనిపించింది. ఆమె విషాదకరమైన మరణానికి కారణమైని నమ్మే టాక్ ఏమిటంటే ప్రవీణ్ ఆమెను చంపి, తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం జరిగినా ఒక్కటి మాత్రం నిజం, ఓ గొప్ప టాలెంట్ టాలీవుడ్‌కి దూరమైంది.

దివ్య భారతి
దివ్య భారతి మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. 90వ దశకంలో బి-టౌన్‌లో తన ముద్ర వేయడానికి ముందు ఆమె టాలీవుడ్‌లో సూపర్ స్టార్. రెండు పరిశ్రమలలో పనిచేసిన ఈ అందమైన నటి ఏప్రిల్ 5, 1993న తన వెర్సోవా అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తు నుండి పడి కన్నుమూసింది. ఆమె మరణం మీడియాలో పెను సంచలనం సృష్టించింది. మరణానికి కారణం ప్రమాదవశాత్తూ, హత్య, అండర్ వరల్డ్ ప్రమేయం అని అనుమానించారు. ఆమె మరణం భారతీయ సినిమా అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.

ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ జూన్ 6, 2015న గుండెపోటుతో మరణించింది. ఆమె పల్మనరీ వ్యాధితో కూడా బాధపడిందని వైద్య అధికారులు తెలిపారు. వివాహం చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తూ ఆమె మరణానికి కారణమైన లైపోసక్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె పదిహేడేళ్ల వయసులో తరుణ్ నటించిన 'నువ్వు లేక నేను లేను' చిత్రంలో కృష్ణవేణిగా నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఖ్యాతి గడించింది.

ప్రత్యూష
టాలీవుడ్ స్టార్‌  ఫిబ్రవరి 23, 2002న 20 ఏళ్ల వయసులో మరణించింది. ఆమె మరణానికి కారణం వివాదాస్పదమైంది. అయితే వారి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని అంటారు కొంతమంది. సిద్ధార్థరెడ్డి అనారోగ్యం నుంచి కోలుకున్నారు, అయితే ప్రత్యూష చికిత్స పొందుతూ మరణించింది. 'రాయుడు', 'శ్రీ రాములయ్య', 'సముద్రం', 'స్నేహమంటే ఇదేరా', 'కలుసుకోవాలని' వంటి చిత్రాలలో ఆమె తన పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: