గతంలో ఒక ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు విడుదల చేసేవారు మన హీరోలు. ఆ తర్వాత ఆ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఒక ఏడాదికి ఒక సినిమాని విడుదల చేయడమే గగనం అయిపోయిందని చెప్పా లి. మారిన ప్రేక్షకుల అభిరుచి అలాగే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఈ విధమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు చిత్రంలో ఇలాంటి పొరపాటు జరిగినా కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కేవలం నటీనటుల నటన మాత్రమే గమనించేవారు.

కానీ ఇప్పుడు సినిమాలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు ఆడియెన్స్. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా సోషల్ మీడియాలో వారిని ట్రోల్ చేస్తున్నారు. పర్ఫెక్షన్ కోసం మన దర్శక నిర్మాతలు హీరోలు కూడా చాలా రోజులు సినిమాల ను తెరకెక్కించి విడుదల చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పటి సినిమాలు ఒక్కొకటి సంవత్సరానికి విడుదలయ్యేలా హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి తన నటించబోయే నాలుగు సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేస్తారని అందరూ భావించి సంబరాలు చేసుకున్నారు.

కానీ ఆయన నటిస్తున్న సినిమాలలో కేవలం రెండు సినిమాలు మాత్రమే వచ్చే ఏడాది విడుదల అవుతున్నాయి అని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను ఈ ఫిబ్రవరి లో విడుదల చేస్తుండగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని అదే ఏడా ది చివర్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఆచార్య సినిమా కి కొరటాల శివ దర్శకత్వం వహించగా, గాడ్ ఫాదర్ సినిమా కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత అయన నటించబోయే తర్వాతి రెండు చిత్రాలు 2023 లోనే చూడొచ్చన్నమాట. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా అలాగే బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న సినిమాలు వచ్చే ఏడాది దాకా ప్రేక్షకులను అలరించలేవన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: