తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులలో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి.. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే.. తెలుగు హీరోయిన్లు ఒకరు ఇద్దరు మాత్రమే తెలుగు సినీ ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఇక ముంబై, మంగళూరు, చెన్నై, కేరళ, బెంగళూరు వంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు ఇతర భాషా సినీ ఇండస్ట్రీ లో నుంచి వచ్చి తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ లుగా మారుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా మొదటి సినిమాతోనే తెలుగులో మంచి హిట్ అందుకున్న శ్రీ లీలా గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం.


శ్రీకాంత్ తనయుడు రోషన్  హీరోగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా లో ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఉత్తమ నటి గా సైమా అవార్డు ను సొంతం చేసుకోవడం గమనార్హం. 2001 జూలై 14వ తేదీన కర్ణాటక లో జన్మించిన శ్రీలీలా చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రొఫెషనల్ కావాలని ఎన్నో కలలు కంది. కానీ యాక్సిడెంటల్గా సినీ రంగం వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. మొదట శాండిల్ వుడ్ లో ఈమె భారత్ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది . ఇక మొదటి సినిమాతోనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ సొసైటీ  లో 100 మంది హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది.


ఇక తర్వాత కిస్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ మంచి గుర్తింపు పొందిన శ్రీలీలా..నటన చూసి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన సినిమాలో పెట్టుకున్నాడు. దర్శకేంద్రుడి డైరెక్షన్ లో ఎవరైనా సినిమా చేశారు అంటే కచ్చితంగా వారు ఓవర్ నైట్ లో నే స్టార్స్ అయిపోతారు కాబట్టి శ్రీలీల కూడా పెళ్లి సందడి సినిమా తో ఓవర్ నైట్ లో ని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతోంది.. అంతేకాదు ఈమె కు వరుస ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. శ్రీ లీలా పారితోషికం  కూడా బాగా పెంచే పనిలోనే ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: