జూనియర్ సావిత్రిగా, అందానికే అసూయ పుట్టే అందంతో అందరి దృష్టిని ఆకర్షించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన నటి సౌందర్య. అందాల ప్రదర్శనకు ఆమె పూర్తి వ్యతిరేకి. ఆమె అసలు పేరు సౌమ్య ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక సౌందర్యగా మార్చుకున్నారు. 12 ఏళ్ల ఆమె సినీ ప్రయాణంలో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. అప్పట్లో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు సౌందర్య అంటే ప్రాణం. ఆమె హీరోయిన్ అంటే ఇక ఆ సినిమా సూపర్ హిట్టే అన్న నమ్మకం కూడా అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించేది. ముఖ్యం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే హీరో, హీరోయిన్లు విక్టరీ వెంకటేష్ , సౌందర్యల జోడీకి క్రేజ్ ఓ స్థాయిలో ఉండేది.

అందం, అనంతమైన అభినయంతో తెలుగు చిత్ర సీమలో చెరగని ముద్రను వేశారు సౌందర్య. అద్భుతమైన కెరియర్, ప్రశాంతమైన జీవితం, మంచి భర్త, అంతా సెటిల్ అనుకున్న తరుణంలో ఒక్క సారిగా 17, ఏప్రిల్ 2004 లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. తెలుగు ప్రేక్షక మనసుల్ని కలచివేసింది.
2004 ఏప్రిల్ 17 న భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ ప్రచారం కోసం తన అన్నయ్యతో పాటు బయలుదేరిన సౌందర్య..ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. తెలంగాణ , కరీంనగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్ధి విద్యాసాగర్ కి మద్దతు తెలపడానికి వెళ్లారు.

ఈమె ప్రచారంలో పాల్గొనడానికి ఆమె బెంగుళూరు లోని జట్కూర్ ఎయిర్పోర్ట్ నుండి తెలంగాణకు చాట్ విమానం  లో బయలుదేరారు. అలా బయలుదేరిన ఆమె కొన్ని నిమిషాలకే మరణించారని వార్తలు ప్రేక్షక అభిమానుల హృదయాల్ని చిదిమేశాయి. గాంధీ విశ్వవిద్యాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సౌందర్య తో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా సజీవదహనమయ్యారు. అలా తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మన అందరికీ దూరమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: