అందాల ముద్దుగుమ్మ నందిత శ్వేత, నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో, అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నందితా శ్వేత ఆ తర్వాత కూడా టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా నందిత శ్వేత, నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది, ఇలా ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అక్షర అనే ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది, ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఆశించిన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేకపోయింది.  ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నందితా శ్వేత సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉండే నందితా శ్వేత అప్పుడప్పుడు తన అంద చందాలు ప్రదర్శితమయ్యే లో ఉన్న ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని పోటోలను పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నందిత శ్వేత సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని దానికి తగిన బ్లౌజ్ ను ధరించి మెడలో ఒక లాకెట్ ను వేసుకొని చాలా క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం నందితా శ్వేత కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో, సంప్రదాయబద్దంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: