టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా మాస్ మహారాజా రవితేజ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇండ్రస్టీ లో ఎన్నో కష్టాలు పడి తన సొంత టాలెంట్ తో  హీరోగా ఎదిగాడు రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్గా, సెకండ్ హీరోగా.. ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ తర్వాత హీరోగా తన సత్తా చాటాడు. శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కిన 'నీకోసం' అనే సినిమాతో హీరో అవతారం ఎత్తాడు రవితేజ. అయితే రవితేజ కెరీర్ కు ఫస్ట్ సక్సెస్ అందించి, తన లైఫ్ ని టర్న్ చేసిన సినిమా మాత్రం 'ఇడియట్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ కి హీరోగా భారీ ఇమేజ్ వచ్చింది. 

ఇక సినిమాలో రవితేజకు జోడీగా రక్షిత హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకి చక్రి మ్యూజిక్ అందించాడు. అప్పట్లో ఈ సినిమాలోని పాటలు యూత్ ని ఉర్రూతలూగించాయి. ఇక సినిమాలో రవితేజ చంటిగాడు లోకల్ అంటూ చూపించే ఆటిట్యూడ్, అతని నటన కి యూత్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. అక్కడితో రవితేజ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఇడియట్ సినిమా తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. ఇలా వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా మారిపోయాడు రవితేజ. 

ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ సినిమాలన్నింటిని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయడమే. దీంతో పూరీ జగన్నాథ్ - రవితేజ కాంబినేషన్ కి ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత రవితేజ ను కొన్ని అపజయాలు పలకరించినా అగ్రహీరోగా మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఇక గత సంవత్సరం క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని ఫ్లాప్స్ నుంచి బయట పడ్డాడు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర వంటి వరుస సినిమాలను చేస్తున్నాడు. వీటిలో కిలాడి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది ఫిబ్రవరి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: