ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలుగా రాణించారు కానీ నిర్మాతల కొడుకులు దర్శకుల కొడుకులు హీరోలుగా రాణించిన సందర్భాలు అతితక్కువ. ఈవిషయంలో రామానాయుడు కొడుకు వెంకటేష్ మాత్రమే మినహాయింపు. ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజ్ వారసుడుగా అతడి సోదరుడు కొడుకు ఆశిష్ రెడ్డి యంగ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.


ఇతడు నటించిన ‘రౌడీ బాయిస్’ మూవీ సంక్రాంతి సినిమాల రేస్ లోకి ఎంటర్ అవుతోంది. నేటితరం ప్రేక్షకుల అభిరుచులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈమూవీని ఎక్కడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా దిల్ రాజ్ నిర్మించాడు. ముఖ్యంగా ఈమూవీలో ఆశిష్ రెడ్డి అనుపమా పరమేశ్వరన్లవ్ ట్రాక్ నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అంటున్నారు.


ఈమూవీ పాటల విషయంలో కూడ ఒక ట్రెండ్ ను దేవిశ్రీ ప్రసాద్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీలో మూడు రీమిక్సింగ్ సాంగ్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ‘చంటీ’ ‘శంకర్ దాదా’ ‘మన్మధుడు’ సినిమాలకు సంబంధించిన మూడు పాటలను ఈమూవీ కోసం రీమిక్స్ చేసారట. గతంలో ‘హుషారు’ మూవీ తీసిన హర్ష కొనుగంటి ఈమూవీకి చాల డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో నేటి యూత్ కు నచ్చే విధంగా ఈమూవీని తీసారు అని అంటున్నారు.  


ఈ సంక్రాంతికి భారీ సినిమాలు అన్నీ తప్పుకోవడంతో ఇక మిగిలిన నాగార్జున ‘బంగార్రాజు’ తో చిన్న సినిమాలు అన్నీ పోటీ పడుతున్నాయి. మహేష్ మేనల్లుడు అశోక్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ దిల్ రాజ్ సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి లతో నాగార్జున పోటీపడటం ఈ సంక్రాంతి ట్విస్ట్. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కనీసం రెండు సినిమాలు చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత్తం కొనసాగుతున్న కరోనా భయాలను పక్కకు పెట్టి తెలుగు ప్రజలు ఈ సంక్రాంతికి వస్తున్న ఎంతమంది యంగ్ హీరోలను ఆదరిస్తారు అన్నది సంక్రాంతి తరువాత మాత్రమే తెలుస్తుంది..





మరింత సమాచారం తెలుసుకోండి: