బుల్లితెర పై యాంకర్ గా, సింగర్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి హరితేజ.. ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది.సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది. సోషల్ మీడియా ద్వారా కొంతమంది నెటిజన్లు తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లకు దగ్గరవుతుంటే మరి కొందరు మాత్రం సెలబ్రిటీలను అడగకూడని ప్రశ్నలు అడిగి వాళ్లకు కోపం తెప్పిస్తున్నారు.. ఈ మధ్య ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి..


నటిగా ఎంత ఫెమస్ అయ్యిందో తెలిసిందే.. ఆ ఫెమ్ తోనే బిగ్ బాస్ 1 లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా బాగా పేరుతెచుకుంది. దాంతో మరింత ఫెమస్ అయ్యింది. ఎప్పుడూ హుషారుగా వుండే ఈ అమ్మడు సోషల్ మీడియా లో అభిమానుల తో చిట్ చాట్ నిర్వహించడం తో పాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. ఒక నెటిజన్ హరి తేజకు కరోనా పాజిటివ్ రావాలని కామెంట్ చేయగా నీకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి గాడ్ బ్లెస్ అంటూ పాప కొట్టినట్లు సమాధానం చెప్పింది. సీరియస్ ప్రశ్నలకు కూడా ఆమె సిల్లిగా సమాధానం చెబుథుంది.


అంతేకాదు.. అలా సరదాగా ఉండటానికి కారణం కూడా చెప్పింది. నవ్వితే బాధలు పోతాయని తాను భావిస్తానని పొగరు అనేది పనికిరాదని అన్నారు. ఇది ఇలా ఉండగా.. మరొక నెటిజన్ మీకు కరోనా పాజిటివ్ అని అనిపిస్తోందని కామెంట్ చేయగా ఇంకా ఏం అనిపిస్తోందని హరితేజ ఘాటుగా బదులిచ్చారు.. ఇదంతా సరదాగా చేసింది హరి తేజ..ఈ విషయం వైరల్ అవుతూన్నాయి.. ఇటీవల డెలివరీ అయిన సమయంలో అమ్మడుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బిడ్డకు కూడా దూరంగా వుంది.. ఆ విషయం అందరినీ కంటతడి పెట్టించింది.. ఇప్పుడు కొద్ది రోజులు పాప తో ఉండనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: