మలయాళ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన 'మాస్టర్' సినిమాలో నటించి ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ స్టార్ అయిపోయింది ఈ అందాల భామ. ఇక ఈ సినిమా తర్వాత మాళవికా మోహనన్ కి వరుస సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి.ఇక ఆఫర్లను క్యాష్ చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం మాళవికా మోహనన్ తన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతోంది. ఇప్పటికే ఈ అందాల భామకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మలయాళ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె తెలుగులో ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అది కూడా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే మెగాస్టార్ చిరంజీవికి జోడీగా మాళవికా మోహనన్ హీరోయిన్గా టాలీవుడ్ కి పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఇప్పటికే ఈ ఆఫర్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 156 వ సినిమా ఇది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. dvv ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మరోవైపు చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: