దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత చిన్న పరిశ్రమ మలయాళ చలనచిత్ర పరిశ్రమ. మిగిలిన కోలీవుడ్, టాలీవుడ్ , శాండిల్ వుడ్ లతో పోల్చుకుంటే ఇక్కడి నటులకు పారితోషకం చాలా తక్కువగా నే ఉంటుంది కానీ సంవత్సరానికి మాత్రం మిగిలిన హీరోలు సంపాదించేంత సంపాదిస్తారు ఇక్కడి వారు. 



ఇలాంటి మలయాళ చలనచిత్ర పరిశ్రమలో 3 దశాబ్దాలుగా సూపర్ స్టార్స్ గా ఉన్న మోహన్ లాల్, మమ్ముట్టి లు తమ నటనతో భారత దేశం వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో సూపరిచితులు. మమ్ముట్టి కి మన టాలీవుడ్ లో అయితే ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. తెలుగు లో ఆయన నటించిన మ్యూజికల్ చిత్రం  స్వాతి కిరణం  , మొన్న వచ్చిన యాత్ర చిత్రాలు ఘన విజయం సాధించాయి. 



న్యాయ శాస్త్రం లో పట్టా అందుకున్న మమ్ముట్టి బాల నటుడిగా చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. 1980లో జూనియర్ ఆర్టిస్టుగా వచ్చి నేడు సూపర్ స్టార్ గా ఏదిగారు. ఇంతకీ మమ్ముట్టి ఎంత సంపాదించాడో తెలుసా. అది తెలుసుకోవాలంటే కింద చదవండి. 



సుమారు 4 దశాబ్దాల సినీ జీవితంలో మమ్ముట్టి తన తోటి నటుల కంటే బాగా ఆర్జిస్తున్నారు. నటుడిగా మాలీవుడ్ లో నిలద్రొక్కుకోవడానికి ఎంతో కష్టపడిన ఈయన తన సంపాదన సైతం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేశారు. మమ్ముట్టి ని చూసి చాలామంది నటి నటులు ఆయన మార్గాన్ని అనుసరించారు. 



మమ్ముట్టి కి చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే ఏంతో ఇష్టం. అందుకు తగ్గట్లుగా నే నటుడిగా సంపాదించిన డబ్బు తో తమిళనాడు, కేరళ , కర్ణాటక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వ్యవసాయ భూములను కొన్నారు. వాటి విలువ సుమారు వందల కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా. అంతేకాకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పలు ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ళు , మాల్స్ ఉన్నాయి. వీటి విలువ కూడా భారీగానే ఉంది. 



మమ్ముట్టి కి సినిమాల తర్వాత ప్రధాన ఆదాయ వనరు మాత్రం మీడియా. ఆయన స్థాపించిన మలయాళం కమ్యూనికేషన్ కింద పలు వార్తా, వినోద రంగాలకు చెందిన ఛానెల్స్ నడుస్తున్నాయి. వీటి విలువ సుమారు 300-400 కోట్ల రూపాయలు అని అంచనా. ఇక్కడే కాకుండా అరేబియా దేశాల్లో సైతం భారీగా ఆస్తులు ఉన్నాయి. 




ఇంత ఆస్తులు సంపాదించడం వెనుక మమ్ముట్టి కష్టం ఏంతో ఉంది చెప్పడానికి ఏ మాత్రం సంకోచం లేదు. తనకు భృతి కల్పించిన మలయాళ చలన చిత్ర పరిశ్రమకు తిరిగి ఏంతో ఇచ్చారు. నిరుపేదలకు ఆర్థికంగా తనకు చేతనైనంత సహాయం చేయడానికి వెనుకాడరు అని చెప్పుకుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: