ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.90 లలో మంచి హాట్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వెలుగు వెలిగింది. తన అందం అభినయంతో ఎన్నో అభిమానులను సంపాదించుకుంది. ఇక తాజాగా రవీనా టాండన్ ఇంట్లో తీవ్రమైన విషాదం అనేది నెలకొంది. ఇక ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత అయిన రవి టాండన్ వృద్దాప్య సమస్యల వల్ల చనిపోయి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీప్రముఖులు అంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు.బాలీవుడ్ నిర్మాత అయిన రవి టాండన్ 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈయన వృద్దాప్య సమస్యల వల్ల శుక్రవారం ఉదయం ముంబయిలోని తన నివాసంలోనే ఈయన  తుదిశ్వాస విడిచారు. ఇక తన తండ్రి మరణించిన ఈ విషయాన్ని ఇన్స్టాలో తెలుపుతూ.. ఇంకా తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలను రవీనా టాండన్ పోస్ట్ చేసింది.తాను పోస్ట్ చేసిన పోస్టులో ఆమె ఇలా పేర్కొంది.

'మీరెప్పుడు కూడా నాతోనే ఉంటారు. నేను కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఐ లవ్ యు నాన్న' అని భావోద్వేగ కామెంట్ తో ఈ పోస్టు రాసుకొచ్చింది.ఇక రవి టాండన్ అకాల మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రవీనా అభిమానులు ఇంకా సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. రవీనా సన్నిహితులు ఇంకా బాలీవుడ్ మీడియా వర్గాల వారు కూడా ఆయన మరణానికి గాను వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.ఇక రవీనా టాండన్ సినిమాల విషయానికి వస్తే ఆమె త్వరలోనే రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న కన్నడ ఇండస్ట్రీ హిట్ పాన్ ఇండియా సినిమా 'కేజీఎఫ్' కి సీక్వెల్ అయిన 'కేజీఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా అలాగే ప్రస్తుతం ఆమె పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: