టాలీవుడ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తమన్నా కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాతో కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదిగి పాపులర్ హీరోయిన్ అయింది. స్టార్ హీరోల సరసన మాత్రమే కాదు చిన్న హీరోల సరసన కూడా నటించడానికి ఏ మాత్రం ఆలోచించదు తమన్నా. ఆ విధంగా ప్రతి భాషలో అదుర్స్ అనిపించుకునేలా ఆమె నటించి ఇప్పటి వరకు భారీ సినిమాల్లో నటించింది.

అందానికి అందం అభినయానికి అభినయం ప్రదర్శించగల ఈ కథానాయిక లాంటి మరో కథానాయిక ఇంతవరకు తెర మీదకు రాలేదు కాబట్టి ఆమెకు ఇంత డిమాండ్ నెలకొంది. అంతకు మించి మంచి డ్యాన్సర్ కావడంతో తమన్నాకు వరుసగా అవకాశాలు రావడానికి ముఖ్య కారణం. డాన్స్ పరంగా చిరంజీవి స్థాయిలో స్టెప్పులు వేయగల ఈమెకు ఇప్పుడు తెలుగులో కొత్త కథానాయిక అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు. అయినా కూడా తన ప్రత్యేకతను తన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేస్తుంది.

కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ కూడా రెమ్యురేషన్ పెంచే విధమైన ఆలోచన చేయలేదు కానీ తమన్నా మాత్రం ఈ సమయంలో పెద్ద సినిమాలు లేని ఈ సిచువేషన్ లో తన రెమ్యూనరేషన్ పెంచడం ఒక్కసారిగా సినిమా వారిని ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటివరకు ఒక్క సినిమాకు రెండు కోట్లు మాత్రమే తీసుకొనే తమన్నా ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లకు పెంచేసిందట. తాజాగా ఓ బాలీవుడ్ సినిమా కోసం ఆమె నాలుగు కోట్ల పారితోషికాన్ని తీసుకోపోతుంది . ఇక ఆమె తెలుగు సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సత్యదేవ్ హీరోగా చేస్తున్న శీతాకాలం గుర్తుందా అనే ప్రేమకథా చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: