ఎప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తూ పంచుల వర్షం కురిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. ఇక తన పంచుల సునామీతో జబర్దస్త్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ప్రస్తుతం జబర్దస్త్ చూసే ఎంతో మంది ప్రేక్షకులు కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ఉన్న స్కిట్ లతో తెర మీదికి వచ్చి ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు హైపర్ ఆది.



 కేవలం కమెడియన్గా మాత్రమే కాకుండా ఈటీవీ లో జరిగే ఎన్నో కార్యక్రమాలకు కంటెంట్ అందిస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా మారిపోయాడు ఈ జబర్దస్త్ టీం లీడర్.  ఇప్పుడు సినిమాలకు స్టోరీలు ఇవ్వడమే కాదు ఇక వరుస అవకాశాలు అందుకుంటూ వెండితెరపై కూడా సత్తా చాటుతున్నాడు హైపర్ ఆది. అయితే ఇటీవల ఆది ప్రేమలో పడ్డాడు అంటూ బుల్లితెరపై రూమర్స్ మొదలయ్యాయి. ఒకప్పుడు ఒక న్యూస్ ఛానల్ లో పనిచేసి ఇప్పుడు జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సాధించిన సుజాత తో హైపర్ ఆది ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


 ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం లో భాగంగా రేటింగ్స్ కోసం రాకింగ్ రాకేష్ సుజాత చేతికి రింగ్ తొడగడంతో హైపర్ ఆది ఎంతో ఫీల్ అయ్యాడట. అంతేకాదు ఇక హైపర్ ఆది సుజాత త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ  పుకార్లు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. అయితే సినీ సెలబ్రిటీల పై ఎప్పుడూ ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం హైపర్ ఆది అధికారికంగా ప్రకటించేంత వరకు ఎవరికీ తెలియదు అని చెప్పాలి.. ఇక మరోవైపు రాకింగ్ రాకేష్ సుజాత లవ్ లో ఉన్నారంటూ జబర్దస్త్ లో చూపిస్తున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి: