సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా  ఎవరు ఏది చేసినా కూడా ఇట్టే వైరల్ అయిపోతోంది. మరీ ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు ఏవైనా చేస్తే ఇంక చెప్పే పనేలేదు . దేశ వ్యాప్తంగా అది హాట్ టాపిక్ అవుతోంది. ఇక, ఇలా తరచూ హైలైట్ అయ్యే కొందరు నటీమణులు ఇండియాలో చాలా మందే ఉన్నారట.అందులో ముదురు భామ అయిన మలైకా అరోరా ఒకరు. మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి.. ఆ తర్వాత నటిగా మారిందీ ఈ బ్యూటీ. ఇప్పుడు వెండితెరపై పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావుడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మలైకా అరోరా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెను ఇలా చూస్తే అందరూ కూడా షాక్ అవుతారు.

నటిగా వెండితెరకు పరిచయం కాకముందే అంటే చిన్న వయసులోనే మలైకా అరోరా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు.. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టినీ కూడా ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్‌లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఇలా పాపులరిటీని సంపాదించుకుని.. దర్శక నిర్మాతల దృష్టిలో ఆమె పడింది.

మోడల్‌గా హవా చూపిస్తోన్నప్పుడే మలైకా అరోరా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు అయితే రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌తో ఆమె పేరు తెచ్చుకుంది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌' చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ కూడా రచ్చ చేసింది


వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న సమయంలోనే మలైకా అరోరా  సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుందట . ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం కూడా చేశారు. ఈ క్రమంలోనే వారికీ ఒక బాబు కూడా పుట్టాడు. ఇక, 2017లో మలైకా అరోరా అర్భాజ్‌కు విడాకులిచ్చిందట.అప్పటి నుంచి తన కెరీర్‌ మీద దృష్టి సారిస్తూ ఆమె ముందుకు సాగిపోతోంది.

 
అర్భాజ్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోందని తెలుస్తుంది.మొదట్లో సీక్రెట్‌తో వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోందట. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లలో రచ్చ చేయడం.. హాలీడే ట్రిప్పులను తెగ ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ తెగ హాట్ టాపిక్ గా మారుతున్నారు.

వరుస పెట్టి సినిమాలు, షోలు మరియు స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ కూడా మలైకా అరోరా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా పంచుకుంటోంది. అలాగే ఫొటోలు మరియు వీడియోలు వదులుతోంది. అంతేకాదు, యోగా చేస్తూ నెటిజన్లకు కూడా కొన్ని టిప్స్‌నూ ఇస్తోంది.


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియా మలైకా అరోరా చేసే రచ్చ అయితే అంతా ఇంతా కాదు. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోన్న ఈ భామ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేసేస్తోంది. దీంతో కుర్రకారు హృదయాల్లో ఆమె గాయాలు  చేస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తూ దేశ వ్యాప్తంగా ఆమె సంచలనం అవుతోంది.

తాజాగా మలైకా అరోరా ఓ పార్టీలో పాల్గొందట.దీనికి కరీనా కపూర్ కూడా వెళ్లిందని తెలుస్తుంది.. ఈ సందర్భంగా ఆమె వింత డ్రెస్‌ను ధరించి ఆమె కనిపించింది. ఇందులో ఆమె బట్టలు వేసుకున్నా లేనట్లుగానే ఉందట ఫలితంగా ఆమె లోదుస్తులతో పాటు అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయట.. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: