ఆమె ఒక్కసారి పాట పాడింది అంటే చాలు ప్రతి ప్రేక్షకుడి మనసును తాకుతుంది ఆ పాట.. ఇక ఆమె గాత్రం ప్రతి ఒక్కరిని పులకరింప చేస్తూ ఉంటుంది.  పల్లె పాటలు దగ్గర్నుంచి సినిమా పాటలు వరకు ఎన్నో పాటలతో ఇప్పటివరకు ప్రేక్షకులను అలరించింది ఆమె. మట్టిలో మాణిక్యం లాగా ఒక్కసారిగా తెర మీదికి వచ్చి ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ సింగర్ గా కొనసాగుతోంది. ఇక ఇంతలా ఇంట్రడక్షన్ ఇచ్చాను అంటే ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది.. ఆమె ఎవరో కాదు మంగ్లీ. కేవలం జానపద పాటలు ద్వారానే తన కెరీర్ ని ప్రారంభించిన మంగ్లీ ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సింగర్ గా కొనసాగుతుంది.



 మంగ్లీ పాడిన ప్రతి పాట కూడా సెన్సేషనల్ హిట్ అవుతుంది. సినిమాలనుంచి జానపదాల వరకు ఇక మంగ్లీ గొంతు జోడించిన ప్రతిపాట ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ఇక ప్రతి పండగకి ఆ పండుగను పురస్కరించుకుని పండుగ గొప్పతనాన్ని చెబుతూ పాట పాడటం.. ఇక ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రతి పండక్కి పాట పాడే మంగ్లీ తనకు ఎంతో ప్రత్యేకమైన మహిళా దినోత్సవం రోజున పాట పాడకుండా ఉంటుందా.. మహిళల గొప్పతనాన్ని చెప్పకుండా ఉంటుందా.



 ఇటీవలే తన గాత్రంతో మరోసారి మహిళా గొప్పతనాన్ని చెబుతూ పాట పాడి అందరినీ మెప్పిస్తుంది మంగ్లీ. గత ఏడాది మహిళా దినోత్సవం గురించి పాడిన పాట ఇప్పటికే ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇక ఇప్పుడు నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగ్లీ మరో ప్రత్యేకమైన పాటతో ప్రేక్షకులను అలరిస్తోంది. వనిత అంటూ సాగిపోయే పాటలో మహిళలు ఎన్ని బాధ్యతలు మోస్తారు... జీవితాంతం బ్రతుకును ఎలా సాగిస్తారు.. ఇక కుటుంబం కోసం ఎంత కష్టపడతారో అన్న విషయాలను చెబుతూ మంగ్లీ పాడిన పాట ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: