టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా "గాడ్ ఫాదర్". మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' సినిమాకి  తెలుగు రీమేక్.ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సల్మాన్ 'గాడ్ ఫాదర్' సినిమా సెట్ లో అడుగుపెట్టారు.మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
 

ఇక ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కి స్వాగతం పలుకున్న ఓ ఫోటోని మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఈ యుగంలో ఇద్దరు లెజెండరీ హీరోస్ కలిసిన అరుదైన విషయం ఇదని.. ఇండియాలోని మోస్ట్ ఫేవరేట్ సల్మాన్ భాయ్ కి వెల్కమ్ పలుకుతున్నామని 'గాడ్ ఫాదర్' టీమ్ పేర్కొంది.ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. ఈ క్యారక్టర్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండనుంది. తెలుగు వెర్సన్ స్క్రిప్ట్ లో దర్శకుడు మోహన్ రాజా చాలా మార్పులును చేసారని సమాచారం తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను ఈ సినిమాలో జోడించారు.ఇక ఒరిజినల్ వెర్షన్ కంటే గ్రాండియర్ గా హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా 'గాడ్ ఫాదర్' సినిమాని రెడీ చేస్తున్నారు. 


సల్మాన్ ఖాన్ పాత్ర నిడివి కూడా పెంచినట్లు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా బాలీవుడ్ పెద్ద స్టార్ హీరో సల్మాన్ ఖాన్ - టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.చిరంజీవి ఇంకా రామ్ చరణ్ లతో ఉన్న సాన్నిహిత్యంతో సల్మాన్ ఖాన్ కనీసం పాత్ర గురించి కూడా అడగకుండా ఈ ప్రాజెక్ట్ చేయడానికి వెంటనే అంగీకరించారని సమాచారం తెలుస్తోంది. ఇందులో నయన తార ఇంకా సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: