టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఇద్దరు హీరోల అభిమానులు అయితే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడిన కానీ ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఎత్తర జెండా అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో తెగ ట్రెండింగ్ అవుతోంది.

ఈ పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ ముగ్గురు కలసి స్టెప్పులను బాగా ఇరగదీశారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన వార్త అయితే తెగ చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి అలాగే నిర్మాత దానయ్య వెళ్లి ఏపీ సీఎం జగన్ ను కలిశారని, అలాగే ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు మరియు పెయిడ్ ప్రివ్యూల విషయంలో కూడా వినతిపత్రం అందించారని అందుకు ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలంగా స్పందించారని వార్తలు పెద్దఎత్తున అయితే వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మీడియాకు తమ సమావేశం వివరాల్ని కూడా చెప్పారు రాజమౌళి. కానీ ఒక్కటి అయితే మిస్ అయింది. అదేంటో కాదు ఎన్టీఆర్ వీడియో కాల్.

సీఎం జగన్ తో రాజమౌళి భేటీ అయిన సందర్భంలో రాజమౌళి ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడించారట. సీఎం జగన్ తో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఏదో రిక్వెస్ట్ కూడా చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే విడుదల తేదీ తేదీకి మరికొద్ది రోజులు సమయం ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. మరో వైపు అభిమానులు కూడా భారీ కటౌట్లు అయితే ఏర్పాటు చేయించుకుంటున్నారు. అయితే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా విడుదల అయితే ఇరువురి అభిమానులకు పండగే పండగ అని తెలుస్తుంది. అభిమానులు ఈ సినిమా కోసం నరాలు తెగే ఉత్కంతటతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ కూడా దానిని తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: