తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన జాబితాలో హీరో సుమన్ కూడా ఉన్నారని చెప్పవచ్చు. తెలుగు చిత్రాలకు మార్షల్ ఆర్ట్స్ పరిచయం చేసింది అర్జున్, భానుచందర్ ,సుమన్ మాత్రమే..  అయితే వీరందరిలో సుమన్ కు ఒక ప్రత్యేకమైన స్థానం కనిపిస్తుంది.. సుమన్ బావ బావమరిది వంటి సాంఘిక చిత్రాలతో పాటుగా.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలలో నటించి ఆయన మెప్పించారు. తెరపై తప్ప ఎప్పుడూ కూడా సినిమా ఫంక్షన్లలో ఈ హీరో అసలు కనిపించడు. ఇకపోతే తాజా గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను తెలియ జేశారు.

కెరియర్ మొదట్లో తను తమిళ సినిమాలు చేసేవాడట. అక్కడే తనకు భానుచందర్ తో స్నేహం ఏర్పడిందని తెలియజేశారు. తెలుగు ఇండస్ట్రీలో తను హీరోగా రాణిస్తాను అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చింది భానుచందర్ అని తెలియజేశారు సుమన్. కానీ తనకి అప్పుడు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చేది కాదని.. అయినా కూడా అవకాశాలు వస్తూ ఉండటంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ తన కెరియర్ ను  ముందుకు తీసుకెళ్లానని తెలియజేశారు. ఇక తెలుగులో మొదటి సారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన తరంగిణి సినిమా ద్వారా ఫస్ట్ సక్సెస్ వచ్చింది ఆ తర్వాత 100 సినిమాలు తెలుగులోనే పూర్తి చేశాను..

ఇక తెలుగు, మలయాళం ,కన్నడ ,హిందీ, తమిళ్, ఒరియా, భోజ్ పురి,  మరాఠీ మొదలైన 10 భాషలలో సుమారుగా 600 వందలకు సినిమాలకు పైగా పని చేసి 44 సంవత్సరాల సినీ కెరీర్లో ఎన్నో పాత్రలను పోషిస్తూ ముందుకు వెళ్లాను. శోభన్ బాబు తర్వాత ఇద్దరు హీరోయిన్లతో చేసిన హీరోగా.. యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా నాకు మంచి పేరు కూడా లభించింది. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నేను ఎన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నిలబడటం అంటే నిజంగా నా అదృష్టం గా భావిస్తున్నాను. నా క్రమశిక్షణ,  నా బిహేవియర్, ఫ్లాపులతో సంబంధం లేకుండా నేను చేసే కృషి , పట్టుదల ఈరోజు నేను ఇండస్ట్రీలో నిలబడడానికి కారణం అని నమ్ముతాను అంటూ సుమన్  చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: