ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో జోడీ లలో సమంత - నాగచైతన్య జంట కూడా ఒకటి అని చెప్పవచ్చు. వీరిద్దరూ వివాహానికి ముందు ఎంత జెన్యూన్ గా ప్రేమించుకున్నారో అంతే అన్యోన్యత గా వివాహం తర్వాత జీవించారు. ఇక పిల్లలకు జన్మనిస్తారు.. సంతోషంగా జీవిస్తారు మహేష్ బాబు, నమ్రత లాగే వీరు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అని ఎంతో మంది అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఒక్కసారిగా విడాకులు ప్రకటించడంతో అటు సినీ లోకం ఇటు సెలబ్రిటీ లోకం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది..

అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత కచ్చితంగా మళ్ళీ కలవాలి అని ఎంతోమంది అభిమానులతో పాటు అటు కుటుంబ సభ్యులు అలాగే సినీ సెలబ్రిటీలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వీరి కలయికలో ఏమాత్రం ఇంప్రూమెంట్ కనిపించలేదు అని చెప్పవచ్చు. సమంత - నాగచైతన్య మళ్లీ కలవాలని ఆశించిన వారిలో నందినిరెడ్డి కూడా ఒకరు. సమంతతో కలిసి జబర్దస్త్, ఓ బేబీ వంటి సినిమాలు చేసింది ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే కానీ.. నాగచైతన్య , సమంత తో కలిసి ఒక అద్భుతమైన లవ్ రొమాంటిక్ సినిమాని తెరకెక్కించాలి అనుకుంది నందిని రెడ్డి.

సమంత తన సినిమాలతో బిజీ కావడం ఇక నాగచైతన్య కూడా సమంతకు దూరం కావడంతో ఇది అసాధ్యం అని భావించింది .కానీ తన సినిమాతో నైనా ఇద్దర్ని కలిసేలా చేయాలని ప్రయత్నం చేసింది నందినిరెడ్డి . కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. నందిని రెడ్డి మాత్రం తన కలల్ని సహకారం చేసుకోవడం కోసం నాగచైతన్య -  సమంత కలిసేలా ప్రయత్నం చేస్తోంది.  అందులో భాగంగానే వీళ్ళిద్దరి ఒకటి చేయాలని అనుకుంటోంది నందినిరెడ్డి. సమంత కూడా ఈరోజు నాగచైతన్య ఫోటో షేర్ చేయడంతో ఈ టాపిక్ మరింత బలం చేకూరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: