
ఈ పథకంలో మొదటి ఏడాది 2,90,669 డ్రైవర్లకు రూ.436 కోట్ల మెర ఖాతాలో జమ చేసినట్లు తెలియజేశారు. ఇందులో ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది ఉండగా, టాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20000 మంది పైగా ఉండగా, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6400 మంది ఉన్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఈ ఆటో డ్రైవర్ల సేవా పథకానికి మొత్తం 3.22 లక్షల దరఖాస్తులు రాగా ఇందులో 2,90,669 మంది మాత్రమే అర్హులను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక జిల్లాల వారీగా కూడా డ్రైవర్ల ఈ పథకాన్ని కింద చాలా మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. అత్యధికంగా విశాఖపట్నంలో అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ పథకాన్ని లద్దీ పొందారు.
కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి రూ. 15,000 రూపాయలు అర్హులు ఉండి రాకపోతే ఇలా చేయండి .
ముందుగా ఆటో డ్రైవర్ సేవ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలి.
ఆ తర్వాత NBM అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి.
అక్కడ ఆటో సర్వీస్ సేవలన సెలెక్ట్ చేసుకుని 2025-2026 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చకోడిని ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఓటిపి ఎంటర్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే స్టేటస్ వివరాలు కనిపిస్తాయి.
అందులో మీ పేరు ఉండి కూడా డబ్బులు రాకపోతే దగ్గరలో ఉండే గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్లి డాక్యుమెంట్లతో సంప్రదించాలి.
ఒకవేళ స్టేటస్ లో మీ పేరు లేకపోతే మళ్లీ కొత్త దరఖాస్తు చేసుకోవచ్చు.