ఇటీవల భీమ్లా నాయక్ తో మంచి సక్సెస్ను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక సినిమాను రూపొందించిన క్రిష్ ఇప్పుడు ఆ అనుభవంతో మరోసారి హరిహర వీరమల్లు సినిమాలో 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య నేపథ్యాన్ని ఎంచుకొని భారీగా రూపొందిస్తున్నాడు.ఈ

 సినిమా లో మొఘల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు వీరమల్లు గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని కనబరిచిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా.. తాజాగా మళ్లీ ఈ సినిమా షూటింగును ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే ఇవాళ శ్రీరామనవమి ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సెట్లో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.

తాజాగా అందుకు సంబంధించి అప్ డేట్ ని అందించారు మేకర్స్. హరిహర వీరమల్లు సెట్లో శ్రీరామనవమి వేడుకలను జరపగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఈ ఫోటోల్లో పవన్కళ్యాణ్ వీరమల్లు గెటప్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాని తక్కువ సమయంలో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు పవన్ కళ్యాణ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: