తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాత తెలుగు వాణిజ్యమండలి అధ్యక్షుడు గా.. నారాయణ దాస్ కె నారంగ్ మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆయన వయసు 78 సంవత్సరాలు. ఈయన తీవ్ర అస్వస్థతతో బాధ బాధపడుతున్న ఆయనను ఇటీవల హైదరాబాదులో ఒక హాస్పిటల్లో చేరారు. దీంతో చికిత్స చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. నారాయణ దాస్ పార్ధివదేహాన్ని మరి కొన్ని గంటలలో ఆస్పత్రి నుంచి తన స్వగృహానికి తీసుకు వెళ్లాలన్నారు. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించనున్నారు.



అంతేకాకుండా ఈయన ఏషియన్ ఫిలిమ్స్ మరియు, ఏషియన్ సినిమాస్ గ్రూప్ అధినేత గా ఉండేవారు. ఇక అంతే కాకుండా నారాయణ దాసు నగరం గత కొన్ని సంవత్సరాల నుండి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ తనదైన శైలిలో ముద్ర వేసుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLB బ్యానర్ ని స్థాపించి వాటిపై ఎన్నో సినిమాలను నిర్మించడం జరిగింది. మొదటి ప్రయత్నం గా" లవ్ స్టోరీ" అనే సినిమాని తెరకెక్కించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం నాగార్జునతో కలిసి ది ఘోస్ట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాని ఈయన నిర్వహిస్తున్నాడు. ఇక అంతే కాకుండా శివకార్తికేయన్ తో ఒక చిత్రం, సుధీర్ బాబు తో కూడా ఒక సినిమాని, సందీప్ కిషన్ తో మైఖేల్ అనే ఒక చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక ఫైనాన్షియర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిక్యూటివ్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు నారాయణదాస్ . అయితే ఆయన మరణవార్త విని ఎంతో మంది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొంతమంది సోషల్ మీడియా ద్వార తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: