నాగార్జున అనగానే అందరికీ గుర్తొచ్చేది టాలీవుడ్ మన్మధుడు. ఎన్నో సినిమాలతో యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకున్నాడు నాగార్జున. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నాడు నాగార్జున. ఇప్పుడు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ గుర్తు చేసుకున్న ఒక మధురమైన అనుభూతి కలిగించే సినిమాల్లో నాగార్జున నటించిన విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాలలో ఆధ్యాత్మిక సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ మన్మథుడు గా పేరు సంపాదించుకున్న నాగార్జున  వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


 ఇక పాత్రలో నాగార్జున తప్ప ఇంకెవరు నటించిన అంతగా న్యాయం చేయలేక పోయి వారేమో అనేంతలా ప్రేక్షకులను మెప్పించాడు నాగార్జున   పూర్తిగా జీవితాన్ని మొత్తం వెంకటేశ్వర స్వామి కి త్యాగం చేసిన భక్తుడిగా ఒదిగిపోయాడు   అయితే ఇదే సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించాడు సుమన్. నిజంగా దేవుడే దిగి వచ్చాడేమో అనేంతలా ప్రేక్షకులను ప్రభావితం చేశాడు. అయితే ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన సుమన్ ను ముందుగా ఆ పాత్ర కోసం తీసుకోవాలని అనుకోలేదట.


 సినిమాలో అన్నమయ్య పాత్ర నాగార్జున  వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడిన సమావేశం ఉంటుంది  ఈ క్రమంలోనే ఇక  వెంకటేశ్వర స్వామి పాత్రలో ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుందని అనుకున్నారూ. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సోగ్గాడిగా పేరు సంపాదించుకున్న శోభన్ బాబును ఆ పాత్రకోసం సంప్రదించారట దర్శకుడు రాఘవేంద్ర రావు. అయితే తాను సినిమాలు మానేశానని శోభన్ బాబు చెప్పిన.. ఒత్తిడి తీసుకొచ్చారట. దీంతో 45 లక్షలకు పైగా పారితోషికం అడగడంతో రాఘవేంద్ర రావు సైలెంట్ అయ్యారు. తర్వాత బాలయ్యతో ఆ పాత్ర చేయించాలని అనుకున్నప్పటికీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో అని బాలయ్య కు చెప్పారట. చివరికి ఇక ఆ పాత్ర సుమన్ వరకు వెళ్ళింది. సుమన్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: