మెగాస్టార్ చిరంజీవి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎంతో కష్టపడి ఇప్పుడు స్టార్ హీరో స్థానాన్ని అందుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు.అందుకే ఇప్పుడు ఆయన రేంజ్ వేరే లెవల్..కొద్ది రోజులు రాజకియాల్లొకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ సినిమాల వైపు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుస సినిమాలలో నటించె ఛాన్స్ ను అందుకున్నాడు. సైరా నరసింహరెడ్డి సినిమా కూడా ఘన విజయాన్ని అందుకోవడంతో ఆయనకు వరుస సినిమాలు వస్తున్నాయి.


ప్రస్తుతం నాలుగు సినిమాలలో నటిస్తూన్నారు.. అందులో ఆచార్య సినిమా కాస్త ముందుగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా ఏప్రిల్ 29 న ప్రెక్షకుల ముందుకు రానుంది.దాంతొ సినిమా ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు మేకర్స్.ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆచార్య సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అటు ఆచార్య టీమ్ కూడా ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కష్టపడుతోంది..


ప్రీరిలిజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం, ఇప్పుడు సమయం దొరికినప్పుడు మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు..నిన్న ఓ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ప్రెస్ మీట్ అయిన తర్వాత ఫోటోలకు పోజులిచ్చే సమయంలో చిరు తన చిలిపితనాన్ని ప్రదర్శించారు. పూజా హెగ్డే చిరంజీవితో ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోతుంటే.. ఆమెను వెనక్కి పట్టి పిలిచిన చిరు, ఆమెతో కామెడీ చేశారు.నన్ను వదిలి వెళ్ళి పోతావా అంటూ పూజాను తన వైపు లాక్కొని ఫోటోలు దిగాడు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.దాంతో నెటిజన్లు కూడా చిరు కూడా ఆ విషయంలో ఘటికుడే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..మరి సినిమా ఎ లెవల్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: