మాస్ హీరో రవితేజ కొత్త దర్శకుడు శరత్ మండువ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. మరొకవైపు మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్లలో చాలా వేగంగా ఉన్నారు ఇప్పటికే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలోని స్పెషల్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.


ఇక ఈ రోజున ఈద్ ను పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఒక స్పెషల్ పోస్టర్ని విడుదల చేయడమే కాకుండా ఒక సరికొత్త కూడా వచ్చారు. సినిమాలోని సొట్ట బుగ్గల అనే రెండో పాటను ఈ నెల 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగ కి తగ్గట్టుగా రిలీజ్ చేయబడిన ఈ పోస్టర్ చాలా వైరల్ గా మారుతోంది. రవితేజ ఒక మసీదు నుండి తన అంబాసిడర్ కార్ వైపు నడుచుకుంటూ వెళుతున్నట్లుగా ఈ పోస్టర్ లో చూపించడం జరిగింది.ఇక ఇందులో రవితేజ చాలా కూల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ రవితేజ ఇందులో డిప్యూటీ కలెక్టర్ గా కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్ గా దివ్యషా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇక ఇందులో కీలకమైన పాత్రలో వేణు తొట్టెంపూడి నటిస్తున్నారు. ఇక వీరితో పాటు సీనియర్ హీరో నరేష్, నాజర్, పవిత్ర లోకేష్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని s.l.v. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ మూవీ జూన్ 17 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. చివరిగా ఖిలాడీ మూవీతో పరాజయం పొందాడు రవితేజ మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: