శ్రీయ శరణ్.. తెలుగు సినీ ప్రియులకు ఈ పేరుతో అస్సలు పరిచయం చేసే అవసరం లేదు. అంతలా ఈ సొట్టబుగ్గల సుందరి చాలా కాలం పాటు టాలీవుడ్‌ను ఏలేసింది. ఆకట్టుకునే అందమే కాదు..మైమరపించే నటనతో ప్రేక్షకులను ఎంతో ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎవరూ చేయని రీతిలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చిందట. ఇలా చాలా ఏళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించింది శ్రీయ.


అయితే, వివాహం తర్వాత శ్రీయ అంతగా సినిమాలు చేయట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది బాగానే సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాత్రూంలో దిగిన ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

 

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే శ్రీయ శరణ్ మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిందట.. అక్కడ ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించిన తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుందట. దీంతో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ఫేమస్ అయిపోయింది శ్రీయ.

 


తెలుగులో ఆరంభంలోనే మంచి మంచి విజయాలతో లక్కీ హీరోయిన్‌గా శ్రీయ మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తడంతో పాటు ఏడాదికి పది సినిమాలు కూడా చేసి ఎవరికీ దక్కని ఘనతను కూడా సొంతం చేసుకుంది. అదే సమయంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకుందిట.. తద్వారా అప్పట్లో ఎక్కువ చార్జ్ చేసిన హీరోయిన్‌గా శ్రీయ రికార్డు కూడా కొట్టేసిందని సమాచారం..


 


తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా సందడి చేసిన శ్రీయ శరణ్.. స్టార్ హీరోలందరితోనూ కూడా ఆడిపాడింది. అలాగే, కొందరు చిన్న హీరోలతో కూడా సినిమాలు చేసింది. మొత్తానికి టాలీవుడ్ మొత్తాన్ని కూడా కవర్ చేసేసింది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో అవార్డులు కూడా అందుకుందట.. తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ శ్రీయ తెగ సందడి చేసింది. అలాగే హిందీ చిత్రాల్లో కూడా నటించింది.


ప్రేమ పెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

 


వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసిందని తెలుస్తుంది. ఇలా చాలా కాలం పాటు అతడితో ప్రేమాయణం సాగించిన తర్వాత.. అంటే 2018లో వివాహం చేసుకుందట.. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించి అందరినీ కూడా ఆశ్చర్య పరిచేసింది. దీంతో ఈమె అప్పుడు హైలైట్ అయిపోయింది.



 


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న శ్రీయ శరణ్.. ఈ మధ్య ఎక్కువగా అందాలను ఆరబోస్తూ ట్రీట్ ఇస్తుంది.. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న పిక్‌లను కూడా ఆమె వదులుతోంది. వీటిలో లిప్ లాక్‌ల ఫొటోలు కూడా ఉంటున్నాయట. ఇలా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌ను తెగ షేక్ చేస్తోంది.


 


గతంతో పోల్చుకుంటే శ్రీయ శరణ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతోందట.. ఇందులో భాగంగానే తాజాగా ఆమె బాత్రూంలో బికినీతో దిగిన ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనితో పాటు మరికొన్ని హాట్ హాట్ పిక్‌లను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు అన్నింటికీ భారీ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ  ఇప్పుడు.వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: