బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరంటే ఏ మాత్రం సందేహం అవసరం లేదు.. నిత్యం మీడియా కెమెరాలకు చిక్కి సోషల్ మీడియాలో వైరల్ కావడం, డేటింగ్ వార్తలతో పతాక శీర్షికలను ఆకర్షించడం శృతి హాసన్‌కు సర్వసాధారణంగా మారింది.


అగ్ర నటులు, భారీ బడ్జెట్ చిత్రాలతో శృతి హాసన్ బాగా బిజీగా ఉంటూ.. ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తన ప్రేమ, అఫైర్లు, డేటింగ్ లాంటి విషయాలపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.

 

నా కెరీర్ గురించి చెప్పాలంటే.. 2022లో అంతా సానుకూలంగా ఉంది. వెబ్ సిరీస్‌తో నాకు ఈ సంవత్సరం మొదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ, ప్రేమను కూడా పొందగలిగాను. అలాగే ప్రభాస్‌తో సలార్, చిరంజీవితో చిరు154, బాలకృష్ణతో NBK107 చిత్రాలతోపాటు పలు దక్షిణా చిత్రాల్లో కూడా నటిస్తున్నాను. ఇంకా పలు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి అని శృతిహాసన్ తెలిపిందట.


 


హిందీ సినిమా రంగంలో కూడా బిజీగా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తున్నాను. ముంబై నాకు సొంత నగరం లాంటిందని మా అమ్మా నాన్న విడిపోయినప్పటి నుంచి నేను ముంబైలో పెరిగాను. అమ్మతో కలిసి నేను హిందీ మాట్లాడుతాను. 2009లో లక్ అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాను. చాలా సినిమాలు చేశాను. కానీ అంతగా నాకు గుర్తింపు అయితే లభించలేదు. పలు ప్రాజెక్టుల గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే నేను మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందు ఉంటాను అని శృతిహాసన్ ఆశాభావం వ్యక్తం చేసిందట.



 


తన జీవితంలోని అఫైర్లు, డేటింగ్ గురించి శృతిహాసన్ ఓపెన్ అవుతూ. శంతను హజారికాకు నాకు కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వారి ద్వారా మా పరిచయం అయితే జరిగింది. సినిమా, మ్యూజిక్, కళలు మా మధ్య కామన్ విషయాలు. అందుకే మేమిద్దరం చాలా వరకు దగ్గరయ్యాం. శంతను లాంటి వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు. నేను గతంలో చాలా మంది యాక్టర్లతో డేటింగ్ చేశాను కానీ వాళ్లతో అస్సలు వర్కవుట్ కాలేదు. అయితే శంతను లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. మా బంధంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది అని ఆమె తెలిపింది.



 


శంతను హజారికాను కలిసిన తర్వాత నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. నా అభిరుచులను గౌరవిస్తాడు. నేనంటే మంచి అభిప్రాయం ఆయనకు ఉన్నది. వినోద పరిశ్రమలో అలాంటి వాళ్లు అరుదుగానే ఎదురుపడుతారు. అందుకే ఆయనకు నేను దగ్గరయ్యాను. తొలిసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తితో నేను ప్రేమలో పడ్డాను. మా డేటింగ్ వ్యవహారం సవ్యంగా సాగుతున్నది అని శృతి హాసన్ తెలిపిందట.


 


నా జీవితంలో పెళ్లి ప్రస్తావన చాలా సార్లే వచ్చింది. పెళ్లి అనే విషయం రాగానే నేను ఎంతో నెర్వస్‌గా ఫీలవుతాను. ఆ బంధంలోకి అంత త్వరగా నేను దూరిపోలేను. అందుకే పెళ్లి గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నాపై నా తల్లిదండ్రుల పెళ్లి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. పెళ్లి వర్కువుట్ అయితే జీవితం కూడా చాలా బాగుంటుంది. వర్కువట్ అయినా కాకున్నా నాకు పెళ్లిపై కూడా మంచి అభిప్రాయం ఉంది. నా తల్లిదండ్రుల విషయంలో వర్కవుట్ కాకపోతే వివాహ వ్యవస్థపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు అని శృతిహసన్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: