సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల కెరీర్ ఎప్పుడు ఎలా మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కొన్ని సంవత్సరాలు మాత్రమే వారికి కెరీర్ కు ఉంటుంది. హీరోల లా వారి కెరీర్ తరాలకు తరాలగా ఉండదు. ఆ విధంగా ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఉన్నన్ని రోజులు మంచి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి పెద్ద సినిమాల్లో నటిస్తూ వెళుతుంది. చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ కెరీర్ స్పాన్ అతి తక్కువ గానే ఉంటుంది కానీ ఆ కాలంలోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరించి అందరినీ ఆకట్టుకోవాలి. హీరోలు ఎలా ఉన్నా పట్టించుకోరు.

కానీ హీరోయిన్ ల విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వారు ప్రతి ఒక్క దాంట్లో పర్ఫెక్ట్ గా ఉంటేనే వారిని హీరోయిన్ గా స్వీకరిస్తారు. అలా క్రేజ్  ఉన్నప్పుడే డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసు కుంటు ఉంటారు. ఆ విధంగా హీరోయిన్ లు ఫేడవుట్ దశకు చేరిన తరువాత ఇండస్ట్రీ నుంచి కొంతమంది వెళ్ళి పోతూ ఉంటారు కొందరు సపోర్టింగ్ రోల్స్ తో పరిశ్రమలో కొనసాగుతూ ఉంటారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక రకాల పాత్రలు చేస్తూ ఉంటారు.

అలా చాలామంది కథానాయకులు అక్క వదిన ఇలాంటి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వంటి స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఈ తరహా పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు. సిమ్రాన్ ప్రియమణి వంటి హీరోయిన్ లు ఎక్కువగా ఈ విధమైన పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక భూమిక చావ్లా కూడా ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. హీరోయిన్ స్నేహ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. జెనీలియా కూడా త్వరలో మొదలు పెట్టబోతుంది. మీరా జాస్మిన్ సదా వంటి హీరోయిన్లు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పుడు తమ సత్తా చాటుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: