టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన వివేక్ ఆత్రేయ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివేక్ ఆత్రేయ,  శ్రీ విష్ణు హీరోగా నివేదా పేతురాజ్ హీరోయిన్ గా తెరకెక్కిన మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి మంచి దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇలా దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వివేక్ ఆత్రేయ ఆ తరువాత శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన బ్రోచేవారెవరురా సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఇలా దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో వివేక్ ఆత్రేయ టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారాడు. ఇలా దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న వివేక్ ఆత్రేయ తాజాగా నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 10 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా వివేక్ ఆత్రేయ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  

అందులో భాగంగా నాని గురించి దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ...  నాని గారు ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ ను చేయలేదు. ఇది చాలా డిఫరెంట్ పాత్ర.  ఈ పాత్రలో చాలా లేయర్ లు ఉంటాయి. ఫన్ ఉంటుంది,  అలాగే దాని వెనకాల పెయిన్ కూడా ఉంటుంది. ప్రతి మాట వినక విభిన్నమైన లేయర్ లు కూడా ఉంటాయి. అయితే అవన్నీ లోపల పెట్టుకుని బయటకు మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అంత ఈజీ విషయం కాదు. నాని ఫన్ గురించి చెప్పనక్కరలేదు. అంటే సుందరానికి మూవీ లో ఖచ్చితంగా డిఫరెంట్ నాని ని చూడబోతున్నారు  అని వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: