‘ఎఫ్ 3’ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంతో అనీల్ రావిపూడి వరస హిట్లకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఈ మూవీ ‘ఎఫ్ 2’ కంటే ఘనవిజయం సాధిస్తుంది అన్న అంచనాలు వచ్చినప్పటికీ ఆ అంచనాలు చేరుకోవడంలో అనీల్ రావిపూడి పూర్తిగా వెనక పడ్డాడు అన్నకామెంట్స్ వచ్చాయి.



ఇలాంటి పరిస్థితులలో ఈ దర్శకుడు తిరిగి తన సత్తా చాటుకోవడానికి బాలకృష్ణ మూవీ రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా రీసెంట్ గా అనీల్ రావిపూడి బాలకృష్ణను కలిసి తాను తీయబోతున్న మూవీకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ ను వివరించినట్లు టాక్.



ఈ కథకు ఓకె చేసిన బాలయ్య అనీల్ రావిపూడిలో సహజ సిద్ధంగా ఉన్న హాస్య చతురతను పూర్తిగా తగ్గించుకుని భారీ ఎమోషనల్ మూవీలా తన మూవీ తీయవద్దని మరీ వెగటు అనిపించకుండా హాస్యాన్ని కూడ ఈ మూవీ స్క్రిప్ట్ లో పూర్తిగా ఉంచమని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన కూతురు పాత్రలో నటిస్తున్న శ్రీలీల పాత్ర నేటితరం అభిరుచులను ప్రతిబించేలా డిజైన్ చేస్తూ తన పాత్రను కూడ ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇస్తూనే హాస్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోమని బాలయ్య అనీల్ రావిపూడికి స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.


ఇక ఈ మూవీని యూత్ కు కనెక్ట్ అయ్యే విధ్యంగా ‘బ్రో ఐ డోంట్ కేర్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీలో హీరోయిన్ గా బాలకృష్ణ పక్కన నటించే వ్యక్తి గురించి ఇంకా అన్వేషణ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. టబు లాంటి సీనియర్ హీరోయిన్ పేర్లు పరిశీలినలో ఉన్నప్పటికీ ఆ పేర్లు అనీల్ రావిపూడికి పూర్తిగా నచ్చడంలేదు అని టాక్. రమ్యకృష్ణ తమన్నా నదియా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల చేయాలి అన్నవార్తలు వినిపిస్తున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: