హీరో నితిన్ మొదట జయం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నితిన్. దిల్ రాజు నితిన్ కాంబినేషన్లో దిల్ సినిమా విడుదలైంది. ఇక ప్రస్తుతం హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఆగస్టు 12న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నది చిత్ర బృందం. ఇందులో హీరోయిన్లుగా కృతి శెట్టి కేథరిన్ నటిస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్రపటం మాత్రం ప్రమోషన్ పనులు చాలా బిజీగా మారిపోయారు.


 ఫస్ట్ ఎటాక్ పేరుతో ఒక టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన మంచి హైపర్ ఏర్పడింది ఈ మూవీలో నితిన్ ఒక పవర్ఫుల్ IAS పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాకుండా ఈ పాత్ర కోసం నితిన్ సరికొత్త లుక్ లో కనిపించడం జరుగుతోంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నిన్నటి రోజున ఒక స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది .


దిల్ రాజు మాట్లాడుతూ.. హీరోగా నితిన్ ఎలా మారాడు సీక్రెట్ ని తెలియజేశారు. మీ అందరి మధ్యలో ఈ సినిమాకు సంబంధించి పాట విడుదల చేయడం తనకు చాలా స్పెషల్ గా అనిపించిందని ఎందుకంటే నితిన్ తో 20 ఏళ్ల అనుబంధం ఉంది. నేను నిర్మాతగా మారి కూడా దాదాపుగా 20 ఏళ్లు అవుతోంది. దీని వెనక ఒక బిగ్ బ్యాక్ స్టోరీ నే ఉన్నది నితిన్ వాళ్ళ తండ్రి నేను వ్యాపార భాగస్వామ్యంలో ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ తో కలిసి తొలిప్రేమ సినిమాని నైజాం లో విడుదల చేసాము ఆ సమయంలో నేను ప్రతిరోజు సినిమా థియేటర్కు వెళ్లి సినిమాలు చూస్తుండే వాడిని అప్పుడు నితిన్ కాలేజీకి వెళ్లకుండానే డుమ్మా కొట్టి సినిమాలు చూసేవారు అలా నితిన్ కు సినిమాలు అంటే ఒక ఫ్యాషన్ ఏర్పడిందని తెలిపారు. అలా మొదట జయం సినిమాతో హీరోగా పరిచయం చేసాము.. అలా యాక్సిడెంట్ ల్ గా  నితిన్ హీరో అయ్యాడు అంటు సీక్రెట్ విషయాన్ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: