రామ్ హీరోగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. దేవదాసు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో డాన్సులు ఫైట్స్ తో తన ప్రత్యేకతను చాటుకుని తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ ఉన్న హీరోగా ఎదిగారు. ఎనర్జిటిక్ స్టార్ నుంచి ఉస్తాద్  హీరోగా మారిన ఈ హీరోకి ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అయితే కెరియర్ ప్రారంభం నుంచి మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ రాపో.

అయితే ఇప్పటిదాకా ఆయనకు క్లాస్ సినిమాల ద్వారానే ప్రేక్షకులను అలరించే హిట్స్ వచ్చాయి అని చెప్పాలి. ఆ విధమైన విజయాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకానొక దశలో ఆయనకు విజయాలు దక్కడం లేదు అన్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అలా ఆ సినిమా తర్వాత మళ్లీ మంచి విజయాన్ని అందుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. రెడ్ సినిమా కూడా మాస్ నేపథ్యంలోనే తెరకెక్కిన సినిమా. తాజాగా లింగస్వామి దర్శకత్వంలో ఆయన నటించిన వారియర్ సినిమా కూడా మాస్ చిత్రంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అయితే ఈ సినిమాలో కంటెంట్ అంత బాగాలేదు అన్నది అభిమానుల నుంచి వస్తున్న మాట. ఒక రొటీన్ కమర్షియల్ సినిమా అనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. మొదటి షో నుంచి నెగటివ్ టాకు వచ్చినప్పటికీ మాస్ సినిమా కాబట్టి బీసీ సెంటర్స్ లో ఈ సినిమా మంచి మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది పక్కా మాస్ మసాలా సినిమా కావడంతోనే ఆ మాత్రం ప్రేక్షకులైన ఆదరిస్తున్నారని అంటున్నారు. అయితే తన టచ్ వదిలేసి మాస్ వెంటపడి దానిని మిస్ చేస్తున్నాడని వార్తలు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు వెల్లడిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఆయన  మాస్ మసాలా సినిమా చేస్తున్న నేపథ్యంలో అతిగా మాస్ వెంటపడి బొక్క బోర్లా పడ్డ హీరోలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. ఇప్పటికైనా తన స్త్రెంత్ కు తగ్గ సినిమాలో రామ్ చేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిమానులు చెబుతున్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: