
టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క బడ్జెట్ పరిమితి రోజురోజుకు ఎల్లలు దాటి పోతున్నాయి. తొలుత లక్షల్లోనే టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క సినిమాలు నిర్మితమయ్యేవి. ఆ తర్వాత ఒకటి రెండు మూడు అంటూ కోట్లల్లో సినిమాలు తెరకెక్కించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా లు చేయడం మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగులో కూడా 100 కోట్ల బడ్జెట్ ను మించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఆ విధంగా దేశవ్యాప్తంగా 100 కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇకపోతే రణభీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సంశేరా సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ఇక టైగర్ ష్రాఫ్ హీరో గా నటిస్తున్న తాజా సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పఠాన్ 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం. సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ కలిసి ఈ సినిమా లో తెరపై కనిపించనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా భవిష్యత్ లో ఇండియన్ సినిమా పరిశ్రమ నుంచి ఎంతటి భారీ బడ్జెట్ సినిమాలు వస్తాయో చూడాలి.