ఇక ఇటీవలే ప్రముఖ తమిళ డైరెక్టర్ సతీష్ విఘ్నేష్ ని ప్రేమించి పెళ్లాడిన నయనతార, పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగించబోతుంది..ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది..మలయాళంలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్..ఈ సినిమా తో పాటుగా ఆమె హిందీలో కూడా షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కిన జవాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది..ఇక ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.ఇక సాధారణంగా ఏ హీరోయిన్ కి అయినా కూడా పెళ్లి తర్వాత క్రేజ్ తో పాటుగా సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయి..కానీ నయనతార కి మాత్రం అసలు ఇసుమంత కూడా డిమాండ్ తగ్గలేదు..ఎందుకంటే ఆమె కెరీర్ ప్రారంభం నుండి నేటి వరుకు కూడా కేవలం గ్లామర్ షో ని మాత్రమే నమ్ముకోలేదు..నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఆమె పోషిస్తూ వస్తుంది..అందుకే డైరెక్టర్స్ ఈమెతో పని చెయ్యడానికి ఇప్పటికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు..తనకి ఉన్న డిమాండ్ ని బట్టి నయనతార తన పారితోషికం కూడా మరింత పెంచేసింది..నిన్న మొన్నటి వరకు కూడా 4 నుండి 6 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే నయనతార.


తన తదుపరి చిత్రాలకు ప్రస్తుతం ఏకంగా 10 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తుందట..నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి అసలు వెనకాడడం లేదు..ఇక దానికి కారణం కూడా లేకపోలేదు..కేవలం నయనతార కోసమే సినిమాలు చూసే ఆడియన్స్ కొన్ని లక్షల్లో ఉంటారు..ఇక నయనతార ఒక సినిమా ఒప్పుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమాలో బలమైన విషయం ఉంది అనే బ్రాండ్ ఇమేజి ఆడియన్స్ లో ఉన్నది..అందుకే నయనతార తన బ్రాండ్ కి తగ్గ పారితోషికం ని డిమాండ్ చేస్తుంది..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది..ఇక అంతే కాకుండా నయనతార కి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది..ఈ ప్రొడక్షన్ హౌస్ లో తన అభిరుచికి తగ్గ సినిమాలు కూడా నిర్మిస్తూ కొత్తవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తుంది నయనతార.

మరింత సమాచారం తెలుసుకోండి: