
16 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ ఇచ్చి ధనుష్.. కార్తీక్ రాజ ప్రోత్సాహంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ హీరోగా మారిపోయారు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. 22వ సంవత్సరంలో తన తండ్రి కస్తూరి రాజా తెరకెక్కించిన.. తుల్లువదో ఇల్లమై.. అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు ధనుష్.. ఆ తర్వాత అన్నా సెల్వ రాఘవన్ తో కాదల్ కొండేయిన్ అనే సినిమాలో నటించారు ఇక ఈ సినిమా మంచి విజయం అవడంతో ధనుష్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
తాజాగా ధనుష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంచి నటనను రాబట్టేందుకు తనను తన అన్న సెల్వ రాఘవన్ కొట్టేవాడని చెప్పుకొచ్చారు. ఆయన ప్రతిరోజు అలా కొట్టడం వల్లే నా నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉన్నది అని తెలిపారు.. ధనుష్ ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే తెలుగు తమిళ భాషలలో సార్ సినిమా అని సిద్ధం చేస్తున్నారు అలాగే ఇటీవల హాలీవుడ్ మూవీ ది గ్రేస్ మ్యాన్ అని ఒక సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించినారు ధనుష్. ఇక ఈ ఏడాది మొదటిలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్యాలతో విడిపోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఇది ఎంత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. మరి రాబోయే రోజుల్లో కలుస్తారేమో చూడాలి.