నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ లో నితిన్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . 24 అక్టోబర్ 2014 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా తెరకెక్కింది. 

మూవీ ని మొదట జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఈ మూవీ ని జులై 22 వ తేదీన పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు ఆగస్ట్  12 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.  

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ ల స్పీడ్ ని వేగవంతం చేసింది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. తాజాగా కార్తికేయ 2 మూవీ యూనిట్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్  ను ఆగస్ట్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి కాలభైరవ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: