ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తన 28వ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ చాలా వేగవంతంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా దాదాపుగా ఐదు భాషాల్లో విడుదలకానున్నట్లు సమాచారం తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు టాక్ షికారు చేస్తుంది. ఒక వేళా ఇక అదే నిజం అయితే మొదటి మహేష్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అని అనుకోవాలి. అందరూ అదే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు. ఓన్లీ తెలుగులోనే చాలా భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు 'పార్థు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది..


ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చొక్కా లేని అవతారంలో ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్‌లో బాగా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసమే అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ షర్ట్‌లెస్‌గా ఉండబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్‌గా కూడా నటిస్తున్నారని, అందుకే ఫిజిక్‌ని సిద్ధం చేసుకున్నారని కూడా వినిపిస్తోంది. SSMB28 సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఈ సినిమా ఏప్రిల్ 28, 2023న విడుదలకానుంది.ఇక మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ గతంలో అతడు ఇంకా ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఏకంగా పదకొండు సంవత్సరాల తరువాత మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తుంది.మహేష్ కెరీర్ లో పోకిరి సినిమా ఎంత స్పెషల్ సినిమానో ఈ సినిమా కూడా అంత స్పెషల్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: