మలయాళ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మలయాళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కొనసాగు తున్న దుల్కర్ సల్మాన్ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన తెలుగు సినిమా మహానటి లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు . ఈ మూవీ లోని దుల్కర్ సల్మాన్ పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ లభించింది . మహానటి మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , కీర్తి సురేష్మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది .

అలా మహానటి మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదిం చుకున్న దుల్కర్ సల్మాన్ తాజాగా సీతా రామం అనే మరో తెలుగు సినిమా లో నటించాడు . సీతా రామం మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు . ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ కి జోడిగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ ఇద్దరి జంటకు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లు వెత్తాయి. ఇది ఇలా ఉంటే మరో సారి ఈ జంట మరో సినిమాలో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తుంది. సీతా రామం మూవీ ని నిర్మించిన వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ మరో ప్రాజెక్ట్ లో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హను రాఘవపూడి లేదా నందిని రెడ్డి లలో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: