కోలీవుడ్ చిత్ర సీమలో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కార్తీ తాజాగా విరుమన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.  

మూవీ ని 2 డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య మరియు జ్యోతిక లు నిర్మించారు. బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విరుమన్ సినిమా మరి కొద్ది రోజుల్లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ ఒకే రోజు నుండి రెండు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కాబోతుంది.  మొదట ఈ మూవీ ని సెప్టెంబర్ 11 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ల్ స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా  'ఓ టి టి' సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాను ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  కూడా సెప్టెంబర్ 11 వ తేదీ నుండి తమిళ భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది.  ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన విరుమన్ సినిమా సెప్టెంబర్ 11 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: