మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించు కున్న రవితేజ ఆ తర్వాత హీరో గా ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు  . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం మాస్ మహారాజ రవితేజ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన క్రాక్ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు .

రవితేజ ప్రస్తుతం ధమాకా  రావణాసుర ,  టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు . అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఒక మూవీ లో కీలక పాత్ర లో కనిపించ బోతున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సినిమాతోగ్రాఫర్ అయినటు వంటి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఒక మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , రవితేజ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో కూడా రవితేజ ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది  ఇది వరకే రవితేజ , సంపత్ నంది కాంపిటీషన్ లో బెంగాల్ టైగర్ మూవీ తెరకెక్కి మంచి విజయం అందుకుంది. ఇలా ఇప్పటికే వరుస మూవీలలో నటిస్తున్న రవితేజ మరో రెండు మూవీ లను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: