అందాల ముద్దు గుమ్మ హరితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ హీరోగా సమంత , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన హరితేజ ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

హరితేజ 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే హరితేజ ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించింది. ఇలా సినిమాల ద్వారా , టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే ఈ ముద్దు గుమ్మ తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే హరితేజ లంగా వోని కట్టుకొని చాలా డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా హరితేజ డిఫరెంట్ లుక్ లో మెరూన్ కలర్ ఉన్న శారీ ని కట్టుకొని ,  డిఫరెంట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ బ్లౌజ్ ని ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హరితేజ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: