హాస్య బ్రహ్మగా దాదాపు 4 దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలిన బ్రహ్మానందం హవా ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. బ్రహ్మానందం డేట్స్ ను బట్టి టాప్ హీరోలు తమ డేట్స్ ను సద్దుబాటు చేసుకునే రోజుల నుంచి బ్రహ్మానందం లేకుండానే టాప్ హీరోల సినిమాలు వచ్చేస్తున్నాయి. 1000 సినిమాలలో నటించి గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కిన బ్రహ్మి మళ్ళీ ట్రాక్ లోకి రాబోతున్నాడా అన్న ఆశలు అతడి అభిమానులకు వస్తున్నాయి.



వాస్తవానికి గతంలో టాప్ దర్శకులు రచయితలు బ్రహ్మనందాన్ని దృష్టిలో పెట్టుకుని టాప్ హీరోల సినిమాలలో కామెడీ ట్రాక్ వ్రాసేవారు. అయితే ఇప్పుడు ఆయన హవా పూర్తిగా తగ్గిపోవడంతో కేవలం అతడిని అతిధి పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక యంగ్ డైరెక్టర్ ‘సైంటిస్ట్ వాలి’ అన్న పాత్రను క్రియేట్ చేసి ఆ కథను తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



గతంలో బ్రహ్మనందం హీరోగా కొన్ని సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘బాబాయ్ హోటల్’ మూవీలో బ్రహ్మీ నటవిశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఆసినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో హీరోగా బ్రహ్మనందం కెరియర్ ముగిసిపోయి కేవలం కమెడియన్ గానే మిగిలిపోయాడు. అయితే ఇప్పుడు 65 సంవత్సరాలు దాటిన వయసులో బ్రహ్మీ మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.



ప్రస్తుతం హాస్యం అంటే ‘జబర్దస్త్’ కమెడియన్స్ హాస్యం తప్ప సున్నితమైన హాస్యం గురించి ఈనాటి తరం ప్రేక్షకులు మరిచిపోయిన పరిస్థితులలో ‘సైంటిస్ట్ వాలి’ ప్రయోగం సక్సస్ అయితే మళ్ళీ బ్రహ్మీ హవా మొదలయ్యే ఆస్కారం ఉంది. కథ పాతదే అయినప్పటికీ చెప్పే విధానం బాగుంటే జనం బాగా చూస్తున్న పరిస్థితులలో ఈ ప్రమోగం సక్సస్ అయితే బ్రహ్మనందానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్లే అనుకోవాలి. దీనితో ఈ మూవీ విడుదల గురించి బ్రహ్మీ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తూ ఈమూవీ సక్సస్ కావాలని కోరుకుంటున్నారు..






మరింత సమాచారం తెలుసుకోండి: