మెగా అభిమానులు ఎప్పటినుంచి వీరి కలయికలో సినిమా వస్తే చూడాలనుకుంటున్నారు. రావాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా చిరంజీవితో ఈ టాప్ డైరెక్టర్ చేస్తే చూడాలనుకుంటారు. అలా మెగాస్టార్ తో దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా చేస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. తాజాగా తన తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ... రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనతో సినిమా చేయాలనుకోవడం లేదు అన్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలలో రెండు సినిమాల యొక్క రిలీజ్ ను సిద్ధం చేశారు. బాబీ దర్శకత్వంలోని సినిమాలు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా తరవాత అయన ఎవరితో సినిమా చేస్తున్నాడో అనేది ఇప్పడు మెగా అభిమానులలో ఎక్కువ ఆసక్తి నెలకొంది. ప్రభుదేవా, వెంకీ కుడుముల, సంపత్ నంది వంటి దర్శకులు అయన తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి చిరు తో సినిమా చేసే అవకాశాన్ని ఏ దర్శకుడు అందుకుంటాడా చూడాలి. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది.