మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పుడు శెరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి గురించి అయన చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. అదే సమయంలో ఎంత పెద్ద హీరో అయినా రాజమౌళి తో సినిమా చేసి హిట్ కొట్టాలనుకుంటారు. అలా చాలామంది యువ హీరో లు ఆయనతో సినిమా చేయడానికి పోటీ పడుతుంటే చిరంజీవి మాత్రం ఈ దర్శకుడితో సినిమా చేయను అని చెప్పడం ఆసక్తిగా మారింది.

మెగా అభిమానులు ఎప్పటినుంచి వీరి కలయికలో సినిమా వస్తే చూడాలనుకుంటున్నారు. రావాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా చిరంజీవితో ఈ  టాప్ డైరెక్టర్ చేస్తే చూడాలనుకుంటారు. అలా మెగాస్టార్ తో దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా చేస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. తాజాగా తన తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ... రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయనతో సినిమా చేయాలనుకోవడం లేదు అన్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలలో రెండు సినిమాల యొక్క రిలీజ్ ను సిద్ధం చేశారు. బాబీ దర్శకత్వంలోని సినిమాలు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా తరవాత అయన ఎవరితో సినిమా చేస్తున్నాడో అనేది ఇప్పడు మెగా అభిమానులలో ఎక్కువ ఆసక్తి నెలకొంది. ప్రభుదేవా, వెంకీ కుడుముల, సంపత్ నంది వంటి దర్శకులు అయన తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి చిరు తో సినిమా చేసే అవకాశాన్ని ఏ దర్శకుడు అందుకుంటాడా చూడాలి. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: