అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తన నటన తో , డాన్స్ తో ,  అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ధమాకా అనే మూవీ లో మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి త్రినాథ్ దర్శకత్వం వహించాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ధమాకా మూవీ నుండి ఇప్పటికే మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను కూడా విడుదల చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ అవకాశాలను దక్కించుకున్న శ్రీ లీల మరో రెండు క్రేజీ మూవీ ల అవకాశాలు దక్కిన దక్కినట్లు తెలుస్తుంది. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా శ్రీ లీల ఇలా వరుస మూవీ ఆఫర్ లతో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: