సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని బోలెడు మంది అయితే కోరుకుంటున్నారు . అలా కోరుకున్న అమ్మాయిలు ఎంత ట్రై చేసిన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు మూడు సినిమాల్లో అవకాశం దక్కించుకున్నా..


ఆ సినిమాలు హిట్ అయినా సరే కొని అనివార్య కారణాలవల్ల సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అందులో ఒకరే ఈ సుహాసిని. అందరూ జూనియర్ సుహాసిని అంటారు. 2003లో బి జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సుహాసిని.. తెలుగు, తమిళం , కన్నడం భోజ్ పూరి చిత్రాలలో కూడా నటించింది. అయితే ప్రజెంట్ సీరియల్స్ లో నటిస్తూ తన లైఫ్ ని కొనసాగిస్తుంది.


సుహాసిని పుట్టి పెరిగింది అంత నెల్లూరులో . సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుహాసిని ఆ తరువాత చంటిగాడు సినిమాతో ఫస్ట్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా హిట్ అవ్వడంతో సుహాసిని కెరియర్ మలుపు తిరగబోతుంది అనుకున్నారు అంత . సీన్ కట్ చేస్తే సుహాసిని ఆ తర్వాత చెప్పుకోతగ్గ సినిమాలలో నటించలేకపోయింది . దానికి కారణం ఒక డైరెక్టర్ అంటూ గతంలో కూడా వార్తలు వినిపించాయి.


అవకాశాలు ఇస్తానంటూ ఓ డైరెక్టర్ ఆమెతో చెడుగా మాట్లాడాడని ..వీడియో కాల్ చేసి నగ్నంగా తన అందాలను చూపించమన్నాడని అప్పుడే సినిమాలో అవకాశం ఇప్పిస్తానని ఓ డైరెక్టర్ ఆమెను బలవంతం చేశారట .దీనికి ఏమాత్రం ఇష్టపడని సుహాసిని నో నో అంటూ ఏడ్చేసి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట . ఇక తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సీరియల్ ద్వారా జనాలకు దగ్గర అయిందట. అయితే మళ్లీ సినిమాల అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.


అమ్మడు దురదృష్టమో ఏమో మళ్లీ డైరెక్టర్ రూమ్ కి రమ్మంటూ ఫోర్స్ చేశారట. దీంతో సినిమా ఇండస్ట్రీ అంటే విరక్తి చెందిన సుహాసిని ఇక సినిమాల జోలికి వెళ్ళను అంటూ తెగేసి చెప్పిందట. ప్రజెంట్ సీరియల్స్ లో నటిస్తున్న సుహాసిని కొన్ని సీరియల్స్ కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. హీరోయిన్ కి మించిపోయిన అందం ఉన్న సుహాసిని ఇలా సీరియల్ హీరోయిన్ గా మారడం నిజంగా సినీ రంగం చేసుకున్న దురదృష్టమని అంటున్నారట ఆమె ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: